తిరుపతి రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. అడుగడుగున పూలవర్షం కురిపించి వారిని స్వాగతించారు. అయితే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్రను గత నెల 1వ తేదీన ప్రారంభించారు. ఈరోజు వారు రేణిగుంటకు చేరుకున్నారు. అయితే అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ గల్లా జయదేవ్, రైతు జేఏసీ నాయకులు. బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నడిచారు బీజేపీ శ్రేణులు. అంబేద్కర్…
ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుత హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ భవనాన్ని గ్రౌండ్+5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర…
మరోరెండు రోజులు ఏపీలో వర్షాలుబంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్ తుఫాన్ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీన పడటంతో…
ఈనెల ఏడవ తేదీ నుంచి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు అందరూ విజయవంతం చేయాలి అని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. మేము దాచుకున్న, మాకు హక్కుగా రావాల్సిన డబ్బులు కొంతకాలంగా రావడం లేదు. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నెరవేరడం లేదు అన్నారు. పీఆర్సీ నివేదిక లో ఉన్న అంశాలు కమిటీ సభ్యులు తెలిసినట్లు లేదు. పీఆర్సీ లో ఫిట్మెంట్ అంశం ఒక్కటే కాదు.. ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలు ముడిపడి ఉంటాయి.…
విజయవాడకు కొత్తబాస్ వచ్చారు. ఇప్పటివరకూ సీపీగా బాధ్యతలు చేపట్టి రిటైరయ్యారు శ్రీనివాసులు. సంతృప్తికరంగా నా పదవీ విరమణ చేస్తున్నా అన్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. నాతో కలిసి పని చేసిన సిబ్బందికి తోటి ఆఫీసర్లకు ధన్యవాదాలు చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియాకు ధన్యవాదాలు అన్నారు శ్రీనివాసులు. మరో వైపు ఇన్ ఛార్జ్ సీపీ పాలరాజు మాట్లాడారు. బత్తిన శ్రీనివాసులు పోలీసు శాఖకు ఎనలేని సేవ చేశారు.…
అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనూహ్యంగా సంఘీభావం తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు రైతులు.. 45 రోజుల పాటు నిర్వహించాలని.. డిసెంబర్ 15వ తేదీకి తిరుమలకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. అయితే, ఈ పాదయాత్రకు వైసీపీ నేతలు రాజకీయాలను అంటగడుతూ వచ్చారు.. కానీ, ఇవాళ వైసీపీ…
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేస్తోన్న నవంబర్ 1న ప్రారంభమైంది. అయితే 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో నేడు 28 రోజు మహాపాదయాత్రకు బ్రేక్ పడింది. Also Read : యువతిని మోసం చేసిన ఉగాండా ఉన్మాది.. రఫ్ఫాడించిన పోలీసులు భారీ వర్షాల దృష్ట్యా పాదయాత్రకు ఈ రోజు విరామం ఇస్తున్నట్లు…
అమరావతిలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో ఈ సిద్ధాంతాన్ని పాటించలేక పోయామని కానీ ఈసారి దీనిని అమలు చేస్తామన్నారు. ఇక నుంచి పార్టీలో వలసలకు అవకాశం ఉండదన్నారు. ఎన్నికలకు ముందు వాసన పసిగట్టి పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించేది లేదన్నారు. అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు తగినట్టుగా పార్టీ బలోపేతం కావాలని,…
ముఖ్యమంత్రి అయ్యేవరకూ అసెంబ్లీకి రాను అంటూ శాసనసభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కుప్పం ఓటమిని డైవర్ట్ చేయడం కోసమే అయన అసెంబ్లీ నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు.. వ్యక్తిత్వం ఇప్పటికే దిగజార్చుకున్న చంద్రబాబు ఇప్పటికైనా మారాలని సూచించిన ఆయన.. భారీ వర్షాలు, వరదలతో జరిగిన…