తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పేదల మెడకు ఉరితాళ్లుగా ఓటీఎస్ వసూళ్లు మారాయన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ కోరుతూ ఈనెల 20న మండల, మున్సిపల్ కార్యాలయాలు, 23న కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతామన్నారు. పేదలను పీల్చిపిప్పి చేయడానికే ఓటీఎస్ ప్రవేశపెట్టారన్నారు చంద్రబాబు. కక్షసాధింపు కోసమే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై బురద జల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రేమ్ చంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడే చెల్లింపులు జరిగాయన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనేవారే కరవయ్యారు. ప్రైవేటు వ్యక్తులకు విక్రయంతో బస్తాకు రూ.500 వరకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల కోట్ల సంపదైన అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రైవేట్ లే అవుట్లలో 5 శాతం భూమి మధ్య తరగతికి పెను భారం అవుతుందన్నారు చంద్రబాబు.