ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు త్యాగాలు త్యాగాలు అని పదేపదే అంటున్నారని ఎవ్వరి కోసం త్యాగాలు చేస్తున్నారో చెప్పాలని ప్రతిపక్షాలను బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు కడుతుంటే ఎంత మంది రైతులు భూములు ఇవ్వలేదని ఆయన అన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనులను త్యాగం అంటారా? ఒక సామాజిక వర్గం కోసం చేసే పనులు త్యాగాలు అవుతాయా అంటూ ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మేము ఏ ఒక్క ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి చెందటం మా పార్టీ విధానమని మంత్రి అన్నారు. మేము చెప్పిందే జరగాలి అనుకుంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వద్దంటున్నారని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఎవరు వచ్చి అచ్చెన్నాయుడుకు చెప్పారు? అంటూ తీవ్ర స్థాయిలో బొత్స వారిపై మండిపడ్డారు.
AlSo Read: సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. కోడిగుడ్లలో నాణ్యత ఏది..?
రేపటి తిరుపతి సభలో టీడీపీనే అల్లర్లు చేసుకుని మా పై నెట్టేసే కుట్ర చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. పోలవరం టీడీపీకి ఏటీఎమ్ కార్డుగా మారిందని బీజేపీ చెప్పింది వాస్తవం కాదా..? అమరావతి ఒక అవినీతి కూపం అని బీజేపీనే చెప్పిందని మంత్రి అన్నారు. రేపు జరిగే తిరుపతి సభ టీడీపీ రాజకీయ సభగా ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. కొన్ని మీడియా సంస్థలు తాము చూపించిందే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నాయి. అదే నిజమైతే వైసీపీ అధికారంలోకి రాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.