తిరుపతి రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. అడుగడుగున పూలవర్షం కురిపించి వారిని స్వాగతించారు. అయితే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్రను గత నెల 1వ తేదీన ప్రారంభించారు. ఈరోజు వారు రేణిగుంటకు చేరుకున్నారు. అయితే అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ గల్లా జయదేవ్, రైతు జేఏసీ నాయకులు. బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నడిచారు బీజేపీ శ్రేణులు. అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలికారు వామపక్ష నాయకులు. ఈ రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు ప్రవాసాంద్రులు. ఇక, రేణిగుంట మీదుగా ఈ పాదయాత్ర తిరుపతికి వెళ్ళింది.