ఏపీ రాజధానిగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలన్నది నాటి సీఎం చంద్రబాబు స్వప్నం. ప్రపంచ ప్రఖ్యాత నగరాలను పరిశీలించి రాజధాని నిర్మాణానికి ప్లాన్ చేశారు. అయితే నిర్మాణం పనులు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కానీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియ మాత్రం మొదలైంది. పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. వాటిలో కొన్ని ముందుకు వచ్చాయి. మరికొన్ని వచ్చే క్రమంలో ఉన్నాయి. ఈ లోగా రాజధాని భూ సేకరణలో అవకతవకల అంశం తెరమీదకు…
అమరావతి రాజధాని పరిరక్షణే ధ్యేయంగా అమరావతి రైతులు, రైతు సంఘాలు, మహిళలు, వైసీపీయేతర పార్టీలు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 24 రోజులుగా అవిశ్రాంతంగా సాగుతోంది. ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. 24 రోజులుగా యాత్ర చేసి కాళ్లు బొబ్బలెక్కిన మహిళలకు నరసరావుపేటలో అపూర్వ గౌరవం లభించింది. టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్బాబు పాలాభిషేకం చేశారు. నిర్విఘ్నంగా…
అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని…
అమరావతి రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని… ఎవరికో భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు బొత్స. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభ లో స్పష్టంగా ప్రకటన చేశారని… అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చామన్నారు. అపోహలు, అభిప్రాయ బేధాలతోనే అమలు్లో ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు. ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా మళ్ళీ బిల్లును తీసుకు వస్తామని… మూడు ప్రాంతాల అభివృద్ధి టకి మళ్ళీ…
ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసింది. రాజధానల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజుకు మంచి ఫలితాలు ఉండేవని, నాటి శ్రీభాగ్ ఒడంబడిక స్పూర్తితో వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ది చెందాలన్న అకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. Read: అన్ని సంస్థలు ఒకేచోట పెడితే ఏప్రాంతం అభివృద్ది…
మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన…
ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 22 రోజులుగా చేస్తున్న మహా పాదయాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించిన తర్వాత రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు షా హితబోధ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఏపీ…