అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శిక్షణ తరగుతలలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని అన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. రాయలసీమలోనే హైకోర్టు ను పెట్టండి అని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చెప్పామని, హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని ఆయన అన్నారు. ఏపీ…
అమరావతిని రాజధానిగా అంగీకరించాలని ఒకవైపు అమరావతి రైతులు ఉద్యమం కొనసాగిస్తున్న వేళ మంత్రులు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల ధరలు పెంచుకోవటం కోసమే ప్రయత్నిస్తూ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆరోపించారు. నగరి లో మండల సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడారు ఎమ్మెల్యే రోజా. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే సమావేశంలో పాల్గొన్న నాయకులు కేవలం అమరావతి పరిధిలోని 29…
రైతుల మహాపాదయాత్ర ముగింపు సభ ఈరోజు తిరుపతిలో జరిగింది. ఈ సభలో రైతులతో పాటుగా ప్రతిపక్షాలు కూడా పాల్గొన్నాయి. తిరుపతిలో జరిగిన మహా పాదయాత్ర ముగింపు సభపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని అన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, టీడీపీ దగ్గరుండి అమరావతి ఉద్యామాన్ని నడిపిస్తోందని అన్నారు. నైతిక విలువల్లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, తోక పార్టీలను…
సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్విఘ్నంగా పూర్తైంది. ఈ సందర్భంగా తిరుపతిలో అమరావతి రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం టూ దేవస్థానం సభ సక్సెస్ అయ్యిందని, మా ముఖ్యమంత్రి కూడా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని అన్నారు. అంతేకాకుండా మళ్లీ బిల్లు పెట్టాలంటే పార్లమెంట్ లో కూడా…
తిరుపతి రాజధాని రైతుల సభకు కన్నా ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక సీఎం జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం, ఏపీ భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులను మోసం చేశారు. మూర్ఖత్వపు ఆలోచనతో సీఎం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. సీఎం జగన్ ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ మండిపడ్డారు.…
ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు త్యాగాలు త్యాగాలు అని పదేపదే అంటున్నారని ఎవ్వరి కోసం త్యాగాలు చేస్తున్నారో చెప్పాలని ప్రతిపక్షాలను బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు కడుతుంటే ఎంత మంది రైతులు భూములు ఇవ్వలేదని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనులను త్యాగం అంటారా? ఒక సామాజిక వర్గం కోసం చేసే పనులు త్యాగాలు…
ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు.. 500 మంది రైతులకు దర్శన సౌకర్యం కల్పించనుంది టీటీడీ.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు… కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. కాగా, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి మహా పాదయాత్ర ప్రారంభించిన…
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు భారీ ఎత్తున ఉద్యమం చేపట్టారు. వారు చేపట్టిన మహాపాదయాత్ర అలిపిరి శ్రీవారి పాదాల వద్జ ముగిసింది. కొబ్బరికాయలు కొట్టి అలిపిరి వద్ద యాత్ర ముగించారు అమరావతి రైతులు. అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని కొబ్బరి కాయలు కాట్టి శ్రీవారిని వేడుకున్నారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 45వ రోజల పాటు సాగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో…
నిత్యం ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే సీపీఎం నేత మధుకి చేదు అనుభవం ఎదురైంది. రాయలసీమ ప్రజా సంఘాల నేతల ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. అయితే, మధు ప్రసంగానికి అడ్డు తగిలారు రాయలసీమ ప్రజా సంఘాల నాయకులు. అమరావతి రైతులకు మద్దతు ఇస్తూ రాయలసీమ ఉద్యమానికి ఎలా మద్దతు పలుకుతారంటూ మధుని ప్రశ్నించారు రాయల సీమ ప్రజా సంఘాల ప్రతినిధులు. ఈ నేపథ్యంలో మధుతో వాగ్వాదానికి దిగారు సీమ ప్రజా సంఘాల నాయకులు. దీంతో…