విశాఖలో జూన్ 21న జరగనున్న యోగా డేలో తాను పాల్గొంటానని, తనను ఆహ్వానించినందుకు సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలన్నారు. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదని, ఆ కలల్ని నిజం చేసే వారి సంఖ్యా తక్కువ కాదన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారని, ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అమరావతి ఒక నగరం కాదని, ఒక శక్తి అని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని, ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించానని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు…
అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం వెలగపూడిలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. సభా వేదిక పైనుంచే 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు, రూ.8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం ప్రధాని…
అమరావతి పునఃప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వచ్చారు. అమరావతి సభా వేదికపైకి చేరుకున్న ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. అమరావతికి నేనున్నానని భరోసా ఇస్తూ.. పునఃప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్.. ప్రధాని మోడీ మరో పేరును రివీల్ చేశారు. ప్రధాని ఓం సన్యాశాస్త్రంలో ఉన్నప్పుడు ఆయనకు అనికేత్ అని పేరు పెట్టారని…
రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ వెలగపూడికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో వెలగపూడి చేరుకున్న ప్రధానికి ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ప్రధాని.. అమరావతి సభా వేదికపైకి చేరుకున్నారు. వేదికపై ప్రధానిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సన్మానించారు. ధర్మవరం శాలువాను కప్పి.. ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. Also…
విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పాలాభిషేకం చేశారు. బీసీల పట్ల మోడీకి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి వల్లే కులగణన సాధ్యమైందన్నారు. కులాల లెక్కలు తీయడం ద్వారా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు లభించనున్నాయని పేర్కొన్నారు. ఇది బీసీల విజయం మాత్రమే కాదు.. దేశంలో ఓ కొత్త శకానికి నాంది అని వ్యాఖ్యానించారు. జనగణనలో కుల గణన చేయడానికి స్వాతంత్య్రం ఉన్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వమూ…
Amaravati Restart Event Live Updates: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం మొదలు కానుంది.
అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం రూ.1,07,002 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. రూ.49,040 కోట్ల రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.. నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు అమరావతికి చేరుకోనున్న మోడీ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. మోడీ సభకు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు..