అమరావతి పునఃప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వచ్చారు. అమరావతి సభా వేదికపైకి చేరుకున్న ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. అమరావతికి నేనున్నానని భరోసా ఇస్తూ.. పునఃప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్.. ప్రధాని మోడీ మరో పేరును రివీల్ చేశారు. ప్రధాని ఓం సన్యాశాస్త్రంలో ఉన్నప్పుడు ఆయనకు అనికేత్ అని పేరు పెట్టారని చెప్పారు.
Also Read: CM Chandrababu: ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అమరావతి.. మూడేళ్లలో పూర్తి చేస్తా..
‘ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఓం సన్యాశాస్త్రంలో ఉన్నప్పుడు ఆయనకు అనికేత్ అని పేరు పెట్టారు. అనికేత్ అంటే.. పరమశివుడు, ఇల్లు లేని వాడని అర్థం. ఇలాంటి ఇల్లు లేని వాడు, కుటుంబం లేని వాడు మన ప్రధాని నరేంద్ర మోడీ.. 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం.. 140 కోట్ల మంది ప్రజానీకాన్ని తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున, అమరావతి రైతాంగం, ఆడపడుచుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.