Couple Missing: మేం ఎక్కువగా అప్పులు చేశాం.. తీర్చలేక వెళ్ళిపోతున్నాం.. మా కోసం వెతక వద్దు అంటూ.. దంపతులు అదృశ్యమయ్యారు.. గోదావరి నదిలో దూకి చనిపోతున్నాం అని సూసైడ్ లెటర్ రాసి మరి భార్యా భర్తలు అదృశ్యమయ్యారు… పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. వాళ్లకు మేం ఊరు వెళ్ళామని చెప్పండి.. లేకపోతే వాళ్లు ఏడుస్తారు అంటూ ఆ లెటర్ లో రాశారు ఆ దంపతులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు యార్లగడ్డ దుర్గా రావు, అతని భార్య సుశీల.. గురువారం సాయంత్రం 4 గంటల నుండి కనిపించడం లేదని బంధువులు అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో ఆ దంపతుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుర్గా రావు తన సెల్ నుండి పండు అనే వ్యక్తి సెల్ కు పంపిన ఆడియో మెసేజ్ లో మోటార్ సైకిల్ అంబాజీపేట కొబ్బరి గోడౌన్ వద్ద ఉందని.. తాళం కూడా దాంట్లోనే పెట్టాను.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని కోరాడు దుర్గారావు.. అయితే, ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారా? అదృశ్యం అయ్యారా అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది..
Read Also: Himachal : హిమాచల్‌లో క్లౌడ్ బరస్ట్.. నలుగురు మృతి, 49 మంది గల్లంతు