Gas Cylinder Blast: రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. ఇక ఘటనలో క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. అమలాపురం పట్టణం రావులచెరువులోని బాణసంచా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. బాణాసంచా పేలుడు దాటికి రెండు అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఇకపోతే అమలాపురం భారీ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 8 మందికి కిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం అందిస్తున్నారు. కాలిపోయిన గాయాలతో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు. ఒక మహిళకు శస్త్ర చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది.
Devara : దేవర ఓవర్సీస్ లేటెస్ట్ కలెక్షన్స్.. రికార్డులు తిరగరాస్తున్నJr. NTR
పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అమలాపురం పట్టణ పోలీసులు. పేలుడు ఘటనపై విజయవాడ నుండి వచ్చిన ఫోరోనిక్స్ ల్యాబ్ నిపుణులతో విచారణ జరుపుతున్నారు. నేడు ఫోరోనిక్స్ ల్యాబ్ నిపుణుల రిపోర్ట్స్ రానున్నాయి. రిపోర్ట్ పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. బాణాసంచా తయారి చేస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ పేలడమే ప్రమాదానికి కారణంగా ప్రాధామిక విచారణలో వెల్లడయింది.
Malala Meeting: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు..