అల్లు అర్జున్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్ గూడ జైలులోని రిసెప్షన్ లోనే ఉన్నారు. కానీ, బెయిల్ పత్రాలు ఆలస్యం రావడంతో ఆయనను మంజీర బ్యారక్ లో ఉంచారు. ఈ సందర్భంగా జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీగా 7697 అనే నెంబర్ ను కేటాయించారు.
Allu Arjun: హీరో అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి ఈరోజు ఉదయం 6.30 గంటలకు విడుదల అయ్యారు. చంచల్గూడ జైలు వెనుక గేట్ నుంచి ఆయన వెళ్లిపోయారు. ఇక, అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అర్జున్, మామ చంద్రశేఖర్ ఉన్నారు.
అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన వైఎస్ జగన్ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో చెంచల్ గూడా జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో వాదోపవాదాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ పై…
త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని, దేశ చరిత్రలోనే 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 1.81 లక్షల…
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనను 11వ నిందితుడిగా చేర్చారు పోలీసులు. నాలుగు సెక్షన్లు నమోదు చేయగా అందులో రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా చెబుతున్నారు. అయితే ఒకపక్క అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా ఆయనకు రిమాండ్ కూడా విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఇంకా…
తనను అరెస్టు చేయడానికి తన నివాసానికి వచ్చిన పోలీసులను చూసి అల్లు అర్జున్ షాక్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప సెకండ్ పార్ట్ సూపర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఉదయమే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నివాసానికి చేరుకుని ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానంకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. స్నానం చేస్తున్న సమయంలోనే పోలీసులు నివాసానికి వచ్చారు.…
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ముందుగా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని జడ్జి ఎదుట హాజరపరచగా ప్రస్తుతానికి వాదనలు…
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉన్నఫలంగా తమతో రావాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను బట్టలు మార్చుకుంటాను అని చెప్పిన వినకుండా పోలీసులు తమతో వచ్చేయాలని బలవంతం చేయడంతో బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు కాగా 105 సెక్షన్ నాన్బెయిలబుల్ కేసు. దానికి 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం.. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని…
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హైదారాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సంధర్భంగా అల్లు అర్జున్ హైదరాబాదు సంధ్య థియేటర్ కి వెళ్ళారు. ఆయన వస్తున్నారని తెలిసి టికెట్ లేని వారు సైతం ఆయనను చూసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఒకానొక సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఇప్పటికీ…