Allu Arjun: శ్రీతేజ్ కోసం సింగపూర్ నుంచి ఇంజెక్షన్ తెప్పించిన అల్లు అర్జున్?
- సంధ్య థియేటర్ దుర్ఘటన తరువాత తీవ్ర మనస్తాపంలో హీరో అల్లు అర్జున్ పుష్ప-2 టీమ్
- శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఓ ఇంజెక్షన్‌ను ఖర్చకు వెనుకాడకుండా సింగపూర్‌ను నుంచి తెప్పించిన అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య థియేటర్ దుర్ఘటన తరువాత హీరో అల్లు అర్జున్, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్‌తో పాటు పుష్ప-2 టీమ్ అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హస్పిటల్ ఖర్చులు హీరో అల్లు అర్జున్‌తో పాటు మైత్రీ మూవీస్ నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నట్టు సమాచారం. దుర్ఘటన జరిగిన రోజు నుంచి హస్పటల్ ఖర్చులు తమ బాధ్యతగా స్వీకరించి అప్పటి నుంచి అన్నీ తామై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైధ్య ఖర్చులన్నీ అల్లు అర్జున్‌తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఓ ఇంజెక్షన్‌ను ఖర్చకు వెనుకాడకుండా సింగపూర్‌ను నుంచి తెప్పించారని చెబుతున్నారు. ఇటీవల హీరో అల్లు అర్జున్ తాను 25 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హస్పటల్ ఖర్చులు, భవిష్యత్‌లో ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే. దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్, మైత్రీ నిర్మాలు, హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడూ శ్రీతేజ్ ఆరోగ్య అప్‌డేట్‌ను తెలుసుకుంటున్నారు.
Bigg Boss 8 Telugu: పక్కాగా పోలీస్ ప్లానింగ్.. ఆల్ హ్యాపీస్!
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ఆ విషయాలను హీరో అల్లు అర్జున్‌కు తెలియజేస్తున్నారని సమాచారం. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీవాస్ తరుచుగా హస్పటల్‌కు కూడా వెళుతూ శ్రీతేజ్ యోగాక్షేమాలు కనుక్కుంటున్నారు. శ్రీతేజ్ పూర్తి ఆర్యోగంగా కోలుకునేవరకు హీరో అల్లు అర్జున్ తరపున వారి అప్‌డేట్‌లను హీరో టీమ్ ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ ఆ సమాచారాన్ని కూడా అల్లు అర్జున్ కి చేరవేస్తున్నారని తెలుస్తోంది. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు అల్లు అర్జున్. బాలుడి ఆరోగ్యం గురించి ఎంతో సానుభూతితో ఉన్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతున్నందును శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. వాళ్ల ఇంటికి ఇప్పుడు వెళ్లలేకపోతున్నానని.. త్వరలో శ్రీతేజ్ కుటుంబాన్ని కలిసి మాట్లాడతానన్నారు. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని అల్లు అర్జున్ తెలిపారు. శ్రీ తేజ్ చికిత్సతో పాటు కుటుంబ అవసరాలకు తాను అండగా ఉంటానన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో వున్నందున .. నేను అతన్ని కలవకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారన్నారు.
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!