Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై వర్మ సంచలనం..దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
- అల్లు అర్జున్ అరెస్టుపై వర్మ సంచలన పోస్ట్
- తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
- ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ హీరో అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించినా సరే ఒకరోజు రాత్రి జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.. వెంటనే ఆయన తన నివాసానికి వెళ్లారు. అయితే ఈ కేసు మీద ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. నేరుగా సంబంధం లేకపోయినా ఇలా ఒక నేషనల్ అవార్డు విన్నర్ ను అరెస్ట్ చేయడం దారుణం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశం మీద వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు.
1. పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
Also Read
2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?
3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?
4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ? అంటూ ఆయన ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!