Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్. బాలుడి ఆరోగ్యం గురించి ఎంతో సానుభూతితో ఉన్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతున్నందును శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. వాళ్ల ఇంటికి ఇప్పుడు వెళ్లలేకపోతున్నానని.. త్వరలో శ్రీతేజ్ కుటుంబాన్ని కలిసి మాట్లాడతానన్నారు. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని అల్లు అర్జున్ తెలిపారు. శ్రీ తేజ్ చికిత్సతో పాటు కుటుంబ అవసరాలకు తాను అండగా ఉంటానన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్ట్ పరిధిలో వున్నందున .. నేను అతన్ని కలవకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారన్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also: Zakir Hussain: తీవ్ర విషాదం.. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత