ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది.
పుష్ప -2 ప్రీమియర్ రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల నాంపల్లి హైకోర్టు అల్లు అర్జునుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. కానీ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని షరతు విధించారు. కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దన్న న్యాయస్థానం సూచించింది. Also Read : UnstoppablewithNBKS4 : బాలయ్య,…
Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు మరోమారు పెద్ద షాక్ తగిలింది. తాజాగా రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులను జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకారం, హాస్పిటల్‌కు వెళ్ళడం అనుమతించడంలో పెద్ద సమస్య ఉండటం వల్ల,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్…
Puspa 2 Collections: “పుష్ప-2 ది రూల్” సినిమా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. కాకపోతే, ఈ సినిమా నాలుగో సోమవారం వసూళ్లు భారీగా తగ్గాయి. ఈ సినిమా 26వ రోజు వసూళ్లు చూస్తే ఇప్పటి వరకు వసూళ్లలో తక్కువగా ఉన్నాయి. అయితే, కొత్త సంవత్సరంలో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే, ‘పుష్ప 2’ 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయలను క్రాస్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ను…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను సీఎం అవుతానన్నారు. తన సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడున్న వాళ్ళు వందల కోట్లు ఖర్చుపెట్టి లక్షల కోట్లు దోచుకున్నారు.. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు.
అల్లు అర్జున్ సినిమా వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ అంశాన్ని ప్రభుత్వం తెర పైకి తెచ్చిందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ పై మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు.. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర హోం సహాయమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలతో ముంచెత్తడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందో అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో గొప్పగా కనబడ్డాడో అర్థం కాలేదన్నారు.