అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అనూహ్యంగా త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చకపోవడంతో అల్లు అర్జున్ సినిమా పక్కన పెట్టాడని ప్రస్తుతానికి అట్లీతో సినిమా పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రెస్ మీట్ లో ఇదే విషయం మీద నిర్మాత నాగ వంశీ స్పందించాడు.
Krithi Shetty: తెలుగొద్దు.. తమిళమే ముద్దు!
త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా గురించి ఇప్పట్లో ఏమీ చెప్పలేమని ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలు పెట్టే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యాడ్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వల్గా మ్యాడ్ స్క్వేర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రెస్ మీట్ లోనే ఆయన అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.