Pushpa 2 : గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప 2” సినిమా బాక్సాఫీసులో సరికొత్త రికార్డు సృష్టించింది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా భారీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సాధించారు. ఈ ఐకాన్ స్టారుకు అభిమానులకు మేజర్ గుడ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ “ద హాలీవుడ్ రిపోర్టర్” ఇండియా సంచిక కవర్ పేజీలో అల్లు అర్జున్ ఫోటో ముద్రితమైంది. ఈ మేగజీన్ భారతదేశంలో “ద హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా” పేరుతో విడుదలైంది. ఈ సంచికలోని మొదటి కవర్ పేజీ అల్లు అర్జున్ ఫోటోను ప్రచురించింది. దీనికి “అల్లు అర్జున్ ది రూల్” అంటూ ప్రత్యేకంగా క్యాప్షన్ ఇచ్చారు.
Read Also:DCP Vineeth : బెంగుళూరులో గ్రాడ్యుయేట్.. డబ్బుల కోసం హైదరాబాద్‌లో ఆ పని చేస్తున్న యువతి
ఈ మేగజీన్ టీమ్ అల్లు అర్జున్ పై ప్రత్యేకమైన ఫోటో షూట్ కూడా నిర్వహించింది. దీని “బిహైండ్స్ సీన్స్” వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, “ఇండియన్ బాక్సాఫీసులో పెద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతి పెద్ద అవకాశం ఇదేనని భావిస్తున్నాను. బలం, ఆత్మ విశ్వాసం మనసులో ఉండేవి. ఎవరూ వాటిని తొలగించలేరు” అని తెలిపారు. అల్లు అర్జున్ విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం ముఖ్యం అని, జీవితంలో విజయం తరువాత కూడా ఎలాంటి గర్వం లేనివారిని చాలా మందిని చూశానని, అది వారి వారి వ్యక్తిత్వం గొప్పతనమని” చెప్పారు.
Read Also:Champions Trophy 2025: ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీం ఇండియా.. దుబాయ్ రోడ్లై పై భారీ ట్రాఫిక్ జామ్
“పుష్ప 2” సినిమా బాక్సాఫీసు వద్ద 1871 కోట్ల వసూళ్లను సేకరించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు తదితరులు నటించారు. “హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా” మేగజీన్‌లో “అల్లు అర్జున్ ది రూల్” పేరుతో ప్రత్యేక ఆర్టికల్ ప్రచురితం అయింది.
The Hollywood Reporter #AlluArjun – The Rule #Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/Tbo6E09jvI
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) February 19, 2025