Producer : బన్నీ లుక్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో ఎలా షేక్ చేసాడో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ తో వస్తాడు అనుకుంటే కథ విషయంలో ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే అల్లు అర్జున్ ఇప్పుడు దర్శకుడు అట్లీతో రాబోతున్నాడు. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా లీకుల రూపంలో దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ లుక్ గురించి నిర్మాత క్రేజీ అప్ డేట్ లీక్ చేశారు.
మనకు తెలిసి తన ప్రతి ఒక మూవీలో అల్లు అర్జున్ తన లుక్ విషయంలో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా మూవీ మూవీ కి అతను ఏదో ఒక స్టైల్‌లో కనిపిస్తాడు. ఇక రీసెంట్‌గా ‘పుష్ప’ లో డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు, బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాడు.ఈ రెండు అతనికి మూవీలో చాలా ప్లస్ అయ్యాయి. ముందు చిత్రాల్లో కూడా డ్రెసింగ్ విషయంలో బన్నీ పెట్టింది పేరు. అందుకే అతనికి స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా మైత్రి నిర్మాత రవి శంకర్ ‘అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో లుక్ ఊహించని విధంగా ఉంటుంది,ఇప్పుడు బన్నీ ఆ లుక్ ప్రిపేర్ చేసే పనిలోనే ఉన్నారు’ అంటూ క్రేజీ అప్డేట్ అందించారు. ఆ లుక్ లో హీరో అందరికీ షాక్ ఇస్తారు. అంటూ కామెంట్స్ చేశారు. ఈ మాటలు ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తున్నాయి. ఇంతకీ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు