పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
READ MORE: Telangana Cabinet: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్తగా10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు
అల్లు అర్జున్, స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజు జరుపుకున్నారు. లవర్‌బాయ్‌గా అల్లు అర్జున్ తొలి చూపులోనే స్నేహతో ప్రేమలో పడ్డారు. అమెరికాలో ఒక శుభాకార్యానికి వెళ్లిన ఐకాన్ స్టార్.. అక్కడ స్నేహను చూసి ప్రేమలో పడ్డాడు. మొదట ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించలేదు. కానీ, బన్ని-స్నేహ మాత్రం ఒకరినొకరు విడిచి ఉండలేమని చెప్పడంతో కుటుంబ పెద్దలు కాస్త ఆలోచించారు. చివరికి పెద్దలు దిగి వచ్చి సంప్రదింపులు జరిపారు. 2010 నవంబర్ 26న ఘనంగా ఈ జంట నిశ్చితార్థం జరిగింది.మూడు నెలలకు 2011 మార్చి 6న వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్- స్నేహ దంపతులకు కుమారుడు అల్లు అయాన్‌తో పాటు ముద్దుల కూతురు ఆర్హ ఉంది.
READ MORE: Off The Record: బాబాయ్.. అబ్బాయ్.. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారా..?