ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నప్పటికీ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. కానీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఇటీవల బన్నీ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టుగా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన కోలీవుడ్ హీరో అని ప్రచారం జరిగింది. కానీ ఆ హీరో ఎవరనే విషయం బయటికి రాలేదు.
అయితే లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ ను ఇటీవల అట్లీ కలిసి స్టోరీ వినిపించగా అందుకు శివ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కోలీవుడ్‌లో పాటు ఇటు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్. ఇటీవల అమరన్ సినిమాతో అటు కోలీవుడ్ పాటు టాలీవుడ్ లోను బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు అట్లీ మాత్రం బన్నీతో భారీ ఎత్తున సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. జవాన్‌తో అట్లీ వెయ్యి కోట్లు కొల్లగొట్టగా పుష్ప 2తో అల్లు అర్జున్ ఏకంగా రూ. 1871 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ కాంబోకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.