‘పుష్ప’ మూవీతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ క్రేజ్ ఏకంగా హాలీవుడ్ మీడియాకు వెళ్ళింది.అవును ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ‘ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్’ పేరుతో భారత్లోనూ అడుగు పెట్టింది. కాగా ఈ తొలి పత్రిక ముఖ చిత్రంగా అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోలకు కూడా దక్కని గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం సంచలనంగా మారింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్‌గా విదేశాల్లో చాల పేరుగాంచింది.
Also Read:Ritu Varma: అలాంటి పాత్రలు చేయాలని ఉంది : రీతూ వర్మ
ఈ పత్రికకు ఆన్ లైన్ ఎడిషన్ కూడా ఉంది. అలాంటి ఈ మ్యాగజైన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ పై దృష్టి పెట్టి భారత్ లోకి ఎంటర్ అయింది. ఇక తాజాగా ఈ కవర్ పేజీ ఫోటో షూట్‌ను కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ మీడియా ద్వారా కొన్ని విషయాలు పంచుకున్నాడు.. ‘ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నాను. బలం, ఆత్మవిశ్వాసం అనేది మనసులో ఉంటాయి. కానీ కొన్ని లక్షణాలు మాత్రం పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని నేను చూశాను. ఏదైనా వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం ఎంత ఎదిగిన వంద శాతం సామాన్యుడినే’ అని అల్లు అర్జున్ వివరించారు.