సినిమాలను అంగీకరించే విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంత కన్ ఫ్యూజన్ కు ఎవరూ గురికారేమో! ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంలో బన్నీ చాలా వేవరింగ్ కు గురౌతుంటాడు. అందువల్లే ‘ఐకాన్’ ప్రాజెక్ట్ మీదా నీలినీడలు కమ్ముకున్నాయంటారు!! ప్రముఖ నిర్మాత దిల్ రాజు – స్టార్ హీరో అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం చాలా గాఢమైంది! దిల్ రాజు బ్యానర్ లో బన్నీ ‘ఆర్య, పరుగు, ఎవడు, దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలను చేశాడు.…
అనూహ్యంగా ఎన్టీఆర్, కొరటాల సినిమా తెరమీదకు వచ్చింది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తే బన్నీ అభిమానులలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్-కొరటాల శివ కలయికలో సినిమా అంటూ ఆ మధ్య ఓ న్యూస్ అధికారికంగానే వచ్చింది. ‘ఏఏ21’ గా గీతా ఆర్ట్స్ 2 సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తారని ఆ ప్రకటన సారాంశం. పాన్ ఇండియా చిత్రంగా తీస్తామనీ చెప్పారు. నాలుగు భాషలలో రాబోయే…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ‘ఐకాన్’ చిత్రం ఉంటుందని ప్రకటించి ఇప్పటికే చాలా కాలం గడుస్తోంది. 2019లో మేకర్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటినుంచి దర్శకుడు వేణు శ్రీరామ్ బన్నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కారణాలేంటో తెలియదు గానీ ఇప్పటివరకు ‘ఐకాన్’ పట్టాలెక్కలేదు. బన్నీ ‘అలా వైకుంఠపురంలో’ తరువాత ‘ఐకాన్’ సెట్స్ పైకి వెళ్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు సరికదా…