ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో
మూవీలోని బుట్టబొమ్మ సాంగ్ విడుదలైన దగ్గర నుండి నేషనల్ వైజ్ అప్లాజ్ ను సంపాదించుకుంది. తమన్ స్వరాలకు తగ్గట్టుగా అర్మాన్ మల్లిక్ పాడిన విధానం, దానికి బన్నీ వేసిన స్టెప్పులతో ఆ క్రేజ్ పీక్స్ కు చేరింది. యూ ట్యూబ్ లో 627 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని ఆ పాట ఓ కొత్త రికార్డ్ ను సృష్టించింది. శిల్పాశెట్టి, సిమ్రాన్, డేవిడ్ వార్నర్, దిశా పటాని మొదలుకొని ఎంతో మంది ఆ పాటలకు స్టెప్పులేశారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ సైతం ఆ జాబితాలో చేరాడు. విశేషం ఏమంటే.. బుట్టబొమ్మ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులేవీ కార్తీన్ ఆర్యన్ వేయలేదు, చివరకు సిగ్నేచర్ స్టెప్పుతో సహా. స్ట్రీట్ స్టయిల్ హిప్ హాప్ తరహాలో ఈ పాటకు కార్తీక్ డాన్స్ చేయడం విశేషం. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో కార్తీక్ ఆర్యన్ బుట్టబొమ్మ, డాన్స్ లైక్ కార్తీక్ ఆర్యన్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో పెట్టగానే వైరల్ అయిపోయింది. అంత సూపర్ హిట్ సాంగ్ ను కార్తీక్ ఆర్యన్ తన సొంత స్టెప్టులతో ఎటెమ్ట్ చేయడమే గ్రేట్! అతని పవర్ ఫుల్ మూవ్స్, ఫుట్ వర్క్ చూస్తే సూపర్ అనకుండా ఎవరూ ఉండలేరు. ఈ డాన్స్ వీడియో చూసిన స్నేహితులు, అభిమానులు సైతం ఫిదా అయిపోయి కార్తీకను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక సినిమాల విషయానికి వస్తే కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం భూల్ భులయ్యా-2
లో నటిస్తున్నాడు. అలానే థమాకా
అనే సినిమాకు కమిట్ అయ్యాడు.
A post shared by KARTIK AARYAN (@kartikaaryan)