కొన్ని విషయాల్లో అల్లు అర్జున్ ను చూస్తే తగ్గేదే లే
అనే పదం అని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పిస్తుంది. స్నేహితుల విషయంలో బన్నీ స్పందన అంతకు మించి
అన్నట్టుగా ఉంటుంది. అందుకే అతనంటే ప్రాణంపెట్టే హితులు అనేకమంది ఉన్నారు. అందులో ఒకరు బన్నీ వాసు. దాదాపు రెండు దశాబ్దాల ఆ చెలిమి రోజు రోజుకూ బలపడుతోంది తప్పితే… పలచన కావడం లేదు. నిన్న శుక్రవారం బన్నీ వాసు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు అల్లు అర్జున్. అయితే… అంతటి ఆగకుండా… అంతకుమించి అన్నట్టుగా ఠక్కున ముంబై వెళ్ళి బన్నీ వాసును సర్ ప్రైజ్ చేశాడు. ప్రతి యేడాది బన్నీ వాసు పుట్టిన రోజును దగ్గరుండి సెలబ్రేట్ చేసే అల్లు అర్జున్… ఈ సారి దానిని మిస్ అవుతాడనే అంతా అనుకున్నారు. ఎందుకంటే ఫిల్మ్ ప్రొడక్షన్ కు సంబంధించిన పనుల కారణంగా బన్నీ వాసు కొన్ని రోజులుగా ముంబైలో ఉంటున్నాడు. పుట్టిన రోజున కూడా అక్కడే ఉండిపోయాడు. హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళి మరి వాసును వ్యక్తిగతంగా అభినందించడంతో అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. అల్లు అర్జున్ తో పాటుగా అతని కొడుకు మాస్టర్ అయాన్, యూవీ క్రియేషన్స్ కు చెందిన వంశీ, కేదార్ సైతం ముంబై వెళ్ళారు. వీళ్ళందరి రాకతో బన్నీ వాసు ఫుల్ ఖుషీ అయిపోయారట.