మెగాస్టార్ అభిమానులకు “పుష్ప” సర్ప్రైజ్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని , అందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని స్టైలిష్ స్టార్ తో స్టెప్పులు వేయనుందని అనే వార్తలు విన్పిస్తున్నాయి. తాజా అప్డేట్ ఏమిటంటే… మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అల్లు అర్జున్ సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట. “పుష్ప”లో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్‌కు బన్నీ కాలు కదపనున్నాడట. అయితే ఆ పాట ఏంటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్, చిరంజీవి పాటకి డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అతను ఇంతకుముందు “ఇద్దరమ్మాయిలతో” మూవీలో చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ పాటకు స్టెప్పులేశాడు. ఈ చిత్రం 2021 ఆగస్టు 13న విడుదల కానుంది.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!