టాలీవుడ్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది గ్లామర్ డాల్ ఊర్వశీ రౌతేలా! తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’లో హీరోయిన్ గా నటిస్తున్న ఊర్వశీ రౌతేలా… గోపీచంద్ ‘సీటీమార్’లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలు విడుదల కాకముందే… అమ్మడు మరో జాక్ పాట్ కొట్టినట్టు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ చేయబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ‘గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4’…
తమ తదుపరి చిత్రంగా మొదలయ్యేది ‘ఐకాన్’ అని స్పష్టం చేశాడు దిల్ రాజు. ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని చెబుతూ ‘వ్యక్తిగతంగా ఈ స్ర్కిప్ట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. వేణుశ్రీరామ్ చెప్పిన లైన్ బాగా నచ్చింది. దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా రెడీ చేశాం. ఇక మొదలు పెట్టడమే తరువాయి’ అంటున్నారు. అప్పటలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను కొంచెం వెనక్కి జరపవలసి వచ్చిందని ఇప్పుడు ఇక…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. ఈ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి బన్నీ అభిమానుల్లో జోష్ ను పెంచే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ చిత్రంలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. సినిమాలోని యాక్షన్…
అల్లు శిరీష్ చేసిన ఇండీ మ్యూజిక ఆల్బమ్ ‘విలయాటి షరాబ్’ గత మార్చి 24న విడుదలై యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. దర్శన్ రావల్ నీతి మోహన్ పాడిన ఈ మ్యూజిక్ వీడియోను అల్లు శిరీష్, హేలీ దారువాలపై చిత్రీకరించారు. ఈ వీడియోకు యుట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకూ ఆరు సినిమాల్లో హీరోగా నటించినా రాని గుర్తింపు శిరీష్ కి ఈ వీడియో ఆల్బమ్ ద్వారా లభించటం విశేషం. తన సోదరుడు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, ధనుంజయ్ ముఖ్యపాత్రధారులు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్…
సినిమాలను అంగీకరించే విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంత కన్ ఫ్యూజన్ కు ఎవరూ గురికారేమో! ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంలో బన్నీ చాలా వేవరింగ్ కు గురౌతుంటాడు. అందువల్లే ‘ఐకాన్’ ప్రాజెక్ట్ మీదా నీలినీడలు కమ్ముకున్నాయంటారు!! ప్రముఖ నిర్మాత దిల్ రాజు – స్టార్ హీరో అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం చాలా గాఢమైంది! దిల్ రాజు బ్యానర్ లో బన్నీ ‘ఆర్య, పరుగు, ఎవడు, దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలను చేశాడు.…
అనూహ్యంగా ఎన్టీఆర్, కొరటాల సినిమా తెరమీదకు వచ్చింది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తే బన్నీ అభిమానులలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్-కొరటాల శివ కలయికలో సినిమా అంటూ ఆ మధ్య ఓ న్యూస్ అధికారికంగానే వచ్చింది. ‘ఏఏ21’ గా గీతా ఆర్ట్స్ 2 సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తారని ఆ ప్రకటన సారాంశం. పాన్ ఇండియా చిత్రంగా తీస్తామనీ చెప్పారు. నాలుగు భాషలలో రాబోయే…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ‘ఐకాన్’ చిత్రం ఉంటుందని ప్రకటించి ఇప్పటికే చాలా కాలం గడుస్తోంది. 2019లో మేకర్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటినుంచి దర్శకుడు వేణు శ్రీరామ్ బన్నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కారణాలేంటో తెలియదు గానీ ఇప్పటివరకు ‘ఐకాన్’ పట్టాలెక్కలేదు. బన్నీ ‘అలా వైకుంఠపురంలో’ తరువాత ‘ఐకాన్’ సెట్స్ పైకి వెళ్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు సరికదా…