Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా కేంద్ర ప్రకటిస్తుందని, గోవధను నిషేధిస్తుందని అలహాబాద్ హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ మతంలో ఆవుకు చాలా ప్రాముఖ్యత ఉందని కోర్టు విశ్వసిస్తోందని పేర్కొంది. మనం లౌకిక దేశంలో జీవిస్తున్నామని, అన్ని మతాలను గౌరవించాలని, హిందూ మతంలో ఆవును దైవంగాీ భావిస్తారని, కాబట్టి ఆవును రక్షించాలి, పూజించాలని జస్టిస్ షమీమ్ అహ్మద్ ఫిబ్రవరి 14న వ్యాఖ్యానించారు.
DOLO 650: డోలో 650 ట్యాబెట్లను తయారు చేస్తున్న కంపెనీ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది.
Vrindavan Temple Corridor: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బృందావన్ టెంపుల్ కారిడార్ పై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఈ టెంపుల్ కారిడార్ వల్ల తాము నిరాశ్రయులం అవుతామని.. తమ జీవనాధారం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు రక్తంతో లేఖలు రాస్తున్నారు. ఈ…
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని దేవతా విగ్రహాలకు నిత్యం ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు సవాల్ చేస్తూ జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వ్ చేసింది.
Allahabad High Court verdict on second marriage of Muslim man: ముస్లిం వ్యక్తి రెండో వివాహంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్య, ఆమె సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్య, పిల్లలను చూసుకోకపోతే, ఖురాన్ అతన్ని రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతించదని తీర్పు వెల్లడించింది. మొదటి భార్య అనుమతి లేకుండా రెండో వివాహాం…
ఇండియాలోని వింతల్లో ఆగ్రాలోని తాజ్‌మహల్‌ది ప్రత్యేక స్థానం. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఈ తాజ్‌మహాల్‌ను నిర్మించారన్నది చరిత్ర. అయితే.. షాజహాన్ తాజ్‌మహాల్ నిర్మించడానికి ముందే అక్కడ శివాలయం ఉండేదని మరోకొందరి వాదన. ఈ నేపథ్యంలోనే తాజ్‌మహల్‌లో రెండు అంతస్థుల్లో ఉన్న 22 మూసిఉన్న గదులను తెరువాలని, దానిపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేయాలని.. అప్పుడే అందులో ఉన్న రహస్యం బయట పడుతుందని బీజేపీ యూత్ మీడియా ఇంఛార్జ్ రజ్ నీష్ సింగ్ అలహాబాద్ హైకోర్ట్ లో…
యూపీలోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పిల్లలను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలిపింది. యూపీలోని వారణాసికి చెందిన ట్రాన్స్జెండర్ 2000 డిసెంబర్ 16న ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంట తాజాగా ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించగా.. వాళ్లు వివాహ…
ఒక మహిళను రక్షించే బాధ్యత.. ఆమెను ఎవరైతే బయటకి తీసుకువెళ్తారో వారిదే అని న్యాయస్థానం తెగేసి చెప్పింది. అమ్మాయి బయటికి ఎవరితో వెళ్తుంది.. తండ్రి, అన్న, స్నేహితుడు, భర్త, బాయ్ ఫ్రెండ్.. ఇలా ఎవరైతే ఆమెను బయటికి తీసుకెళ్లారో.. మళ్లీ ఆమె గమ్యస్థానానికి తిరిగివచ్చేవరకు అమ్మాయి పక్కనున్న వ్యక్తిదే బాధ్యత అని తెలిపింది. సాముహిక అత్యాచారం కేసులో ప్రియుడు వేసిన బెయిల్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయి అంగీకారంతో…