ఇండియాలోని వింతల్లో ఆగ్రాలోని తాజ్‌మహల్‌ది ప్రత్యేక స్థానం. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఈ తాజ్‌మహాల్‌ను నిర్మించారన్నది చరిత్ర. అయితే.. షాజహాన్ తాజ్‌మహాల్ నిర్మించడానికి ముందే అక్కడ శివాలయం ఉండేదని మరోకొందరి వాదన. ఈ నేపథ్యంలోనే తాజ్‌మహల్‌లో రెండు అంతస్థుల్లో ఉన్న 22 మూసిఉన్న గదులను తెరువాలని, దానిపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేయాలని.. అప్పుడే అందులో ఉన్న రహస్యం బయట పడుతుందని బీజేపీ యూత్ మీడియా ఇంఛార్జ్ రజ్ నీష్ సింగ్ అలహాబాద్ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గురువారం తిరస్కరించింది. తాజ్‌మహల్ వెనుక ఉన్న “అసలు నిజం” తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలనే అభ్యర్థన “న్యాయబద్ధం కాని” సమస్య అని కోర్టు పేర్కొంది. తాజ్‌మహల్‌లోని 22 గదులు తెరువడానికి ఈ కోర్టు తీర్పు ఇవ్వలేదని, గదులు తెరవడానికి సంబంధించిన అభ్యర్థన కోసం, చారిత్రక పరిశోధనలో సరైన పద్దతి ఉండాలి. దీనిని చరిత్రకారులకు వదిలివేయాలి” అని కోర్టు తీర్పులో జోడించింది.