Live-in-relationship:‘‘లిన్- ఇన్ రిలేషన్’’లపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఒక భాగస్వామికి అప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకోనట్లయితే, సహజీవనంలో ఉన్న వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోరలేరని తీర్పు చెప్పింది. లివ్-ఇన్‌లో ఉంటున్న ఒక జంట రక్షణ కోరిన తర్వాత, రక్షణ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. డిసెంబర్ 16న ఈ కేసుపై న్యాయమూర్తి వివేక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సంపూర్ణం కాదని, అది అప్పటికే ఉన్న జీవిత భాగస్వామి చట్టబద్ధ హక్కులను ఉల్లంఘించకూడదని…
వివాహ బంధానికి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సమాజం అంగీకరించదు. ఈ మధ్య వివాహేతర సంబంధాలు కారణంగా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలిసిందే.
High Court: మతాంతర జంటను నిర్భందించినందుకు పోలీసులపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 15న కోర్టు ప్రాంగణంలోనే మతాంతర జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిని శనివారం న్యాయమూర్తులు సలీల్ కుమార్ రాయ్, దివేష్ చంద్ర సమంత్‌ల ధర్మాసనం ముందు హాజరుపరిచారు. షేన్ అలీ, రష్మీలను కస్టడీలోకి తీసుకోవడం ‘‘చట్టవిరుద్ధం’’అని ధర్మాసనం పేర్కొంది. ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ జంటను కస్టడీలోకి తీసుకున్నారని, వెంటనే…
మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం హిందూ పక్షానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
Allahabad High Court: 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు (జూన్ 4న) విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది.
Forced Conversion: బలవంతంగా మతం మార్చడం తీవ్రమైన అంశమేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనింది. భారతదేశంలో నివాసం ఉంటున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ముందుకు నడుచుకోవాలని సూచించింది.
అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అలహాబాద్ హైకోర్టులో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అలహాబాద్ హైకోర్టులో ఓ అత్త తన కోడలు గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తాజాగా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో.. అత్తగారు తన కోడలిపై ఇలాంటి కేసు పెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గరిమా తన కోడలితో పాటు 5 గురు కుటుంబీకులపై ఈ ఫిర్యాదు చేసింది.
ఓ ప్రేమజంటకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిదండ్రుల్ని ఎదురించి వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోలీస్ రక్షణను హక్కుగా డిమాండ్ చేయరాదని.. ఒకవేళ నిజమైన బెదిరింపు అయితే పోలీసులు రక్షణ కల్పిస్తారని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
Allahabad High Court: అరెస్ట్ చేయడానికి గత కారణాలను నిందితులకు సరిగా తెలియజేయాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాన్ని తెలియజేయడం తప్పనిసరి అవసరం అవసరమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. చట్టబద్ధమైన పరిమితులు ఉన్నప్పటికీ, కారణాలు తెలియజేయకపోతే బెయిల్ మంజూరు చేయడానికి ఒక కారణం అవుతుందని కోర్టు తీర్పు చెప్పింది.
Allahabad HC: అలహాబాద్ హైకోర్టు వరస వివాదాల్లో ఇరుక్కుంటుంది. తాజాగా, అత్యాచార బాధితురాలి తీరును తప్పుబడుతూ ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఇది వివాదంగా మారింది. సోషల్ మీడియా వ్యాప్తంగా తీర్పును తప్పుపడుతున్నారు.