అన్నాచెల్లెళ్ళ అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న సినిమా ‘రక్షాబంధన్’. అక్షయ్ కుమార్, భూమీ ఫడ్నేకర్ జంటగా ఈ సినిమా ఆనంద్ ఎల్. రాయ్ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. హిమాన్షు శర్మ, కనికా థిల్లాన్ సహ రచయితలుగా వ్యవహరిస్తున్న ‘రక్షాబంధన్’ను తన సోదరి హీరానందాని కి డెడికేట్ చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు. ఇందులో సహెజ్ మీన్ కౌర్, దీపికా ఖన్నా, సదియా ఖతీబ్, స్మృతి శ్రీకాంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2020 ఆగస్ట్ 3 రక్షాబంధన్ సందర్భంగా…
2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైనెస్స్’ చక్కని విజయాన్ని సాధించింది. ఓ సూపర్ స్టార్, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఈ సెన్సిబుల్ పాయింట్ ను నట దర్శకుడు లాల్ తనయుడు జీన్ పాల్ లాల్ (జూనియర్ లాల్) హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ చిత్రంలో…
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని ఢీకొట్టబోతున్నాడు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంటే ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా విడుదలను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నారు. Read Also : మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అనుకుంటున్నారు… కానీ…! బాలీవుడ్…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్యవంశీ’.. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ఇప్పటికే కరోనా లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. తాజాగా దీపావళీ పండక్కి థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే థియేటర్లను తిరిగి తెరుస్తామని ప్రకటించడంతో దర్శకుడు రోహిత్ శెట్టి సూర్యవంశీ చిత్రాన్ని థియేటర్లో విడుదల…
(సెప్టెంబర్ 21న బిపాసా తొలి చిత్రం ‘అజ్ నబీ’కి 20 ఏళ్ళు) దర్శకద్వయం అబ్బాస్-ముస్తాన్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దిట్ట అనిపించుకున్నారు. యాక్షన్ మిళితం చేసి తమ కథలను రంజింపచేయడంలోనూ అబ్బాస్- ముస్తాన్ సఫలీకృతులయ్యారు. అక్షయ్ కుమార్ ను ‘ఖిలాడీ’గా జనం ముందు నిలిపినా, షారుఖ్ ఖాన్ ను నెగటివ్ రోల్ లో ‘బాజీగర్’గా తెరకెక్కించినా వారికే చెల్లింది. ఇక బాబీ డియోల్ ను ‘సోల్జర్’గా రూపొందించిందీ వాళ్ళే. 2001లో అబ్బాస్-ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ నబీ’…
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బెల్‌బాటమ్’.. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకొంది.. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 16న స్ట్రీమింగ్కు ఉంచుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. రంజిత్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణీ కపూర్ కథానాయికగా నటించింది.. ఇందులో అక్షయ్‌కుమార్ అండర్ కవర్ రా ఏజెంట్ ‘బెల్‌బాటమ్’గా కనిపించారు. ఇక బెల్‌బాటమ్ అనేది అక్షయ్‌కుమార్ కోడ్ నేమ్.. లారా దత్తా…
(సెప్టెంబర్ 9న అక్షయ్ కుమార్ బర్త్ డే)ఇంతింతై వటుడింతై అన్న చందాన అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో పాతకు పోయారు. ఓ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా అల్లుడు అక్షయ్ కుమార్ అని ఇప్పుడు పేరు సంపాదించారు. కానీ, ఏ అండా లేకుండానే రంగుల ప్రపంచంలో అక్షయ్ కుమార్ నిలదొక్కుకోవడం విశేషమనే చెప్పాలి. పైగా కొందరు ప్రముఖుల వారసుల ఆధిపత్యం ముందు అక్షయ్ నిలవడని కొందరు భావించారు. అలాంటి వారు నేడు నోళ్లు వెళ్ళ బెట్టుకొనేలా…
బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తల్లి నేడు తుది శ్వాస విడిచారు. తల్లి అనారోగ్యం బారిన పడిందని తెలియడంతో సెప్టెంబర్ 6న లండన్ నుంచి ఇండియా చేరుకున్నారు అక్షయ్ కుమార్. ఆయన తన నెక్స్ట్ మూవీ షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లారు. అక్షయ్ తల్లి శ్రీమతి అరుణ భాటియా వృద్ధాప్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.…
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే తల్లి అనారోగ్యంపై సమాచారం అందిన వెంటనే అక్షయ్ కుమార్ హుటాహుటీన లండన్ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్నారు. రాత్రి ముంబై ఎయిరోపోర్టుకు చేరుకున్న అక్షయ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల అక్షయ్ షూటింగ్ కోసం…
ఒకప్పుడు మన హీరోలు స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసేవారు. దాంతో ఒక్కో హీరో ఖాతాలో వందలాది సినిమాలు ఉంటూ వచ్చాయి. కాలం మారింది. పర్ ఫెక్షన్ పేరుతో ఏడాదికి ఒక సినిమా చేయటమే గగనంగా మారింది. దానికనుగుణంగా హీరోల కెరీర్ లో వంద సినిమాలు అనేది ఇంపాజిబుల్ టాస్క్ గా మారింది. ప్రత్యేకించి ఈ తరం హీరోలు వంద మార్క్ కు చేరటం తీరని కలగా మిగిలిపోతోంది. మన స్టార్ హీరోలలో చిరంజీవి 150కి పైగా…