సామాజికాంశం నేపథ్యంలో ‘ఓ మై గాడ్ -2’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2012లో వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’కు సీక్వెల్ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన రెండు పోస్టర్స్ ను అక్షయ్ కుమార్ శనివారం తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు… ఉజ్జయినిలో పంకజ్ త్రిపాఠీతో పాటు ఉన్న ఓ చిన్న పాటి వీడియోనూ విడుదల చేశారు. ‘మీ శుభాకాంక్షలు, అభినందనలు ‘ఓఎంజీ -2’కు కావాలి. ప్రధానమైన సామాజికాంశం నేపథ్యంలో ఈ సినిమాను నిజాయితీతో తీయబోతున్నాం. ఈ ప్రయాణంలో ఆదియోగి ఆశీస్సులు మాకు ఉంటాయని నమ్ముతున్నాం” అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో యామీ గౌతమ్ ఓ కీలక పాత్ర పోషించబోతోంది. ఈ చిత్రానికి అమిత్ రాజ్ రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు. విపుల్ డి షా, రాజేశ్ బెహల్, అశ్విన్ వార్దే ‘ఓఎంజీ -2’ను నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఓ మై గాడ్’ చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు పరేశ్ రావెల్ కీలక పాత్ర పోషించారు. ఇదే సినిమా తెలుగులో ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్ అయ్యింది. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆయన నటించిన కాప్ డ్రామా ‘సూర్యవంశీ’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘అత్రంగీ రే’, ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’, ‘రక్షాబంధన్’, ‘రామ్ సేతు’, గుర్ఖా’ చిత్రాలలో అక్షయ్ నటిస్తున్నారు. కాగా ‘బెల్ బాటమ్’ మూవీ ఇటీవలే విడుదలైంది.
Also Read
- Kaaka Movie: 'కాకా' నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
- Ramayana Part 1: రావణుడిని హైలైట్ చేయడం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదే.. నమిత్ క్లారిటీ!
- Vrushakarma: ‘కింగ్ 100’లో నాగచైతన్య గెస్ట్ రోల్? ఒక్క మాటతో హింట్ ఇచ్చేసిన చైతూ!
- Kaka Vs Viswambhara: 'కాకా' ఓకే.. 'విశ్వంభర' చప్పుడు లేదేంటి బాసూ..!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Kaaka Movie: ‘కాకా’ నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
-
Boyapati: చిరంజీవి, బాలయ్యల కోసం కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్
-
RBI Repo Rate Hike: లోన్ తీసుకున్న వారికి బిగ్ అలర్ట్.. డిసెంబర్ 4న ఆర్బీఐ భారీ వడ్డీ బాంబు! పెరగనున్న ఈఎంఐలు..
-
Ramayana Part 1: రావణుడిని హైలైట్ చేయడం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదే.. నమిత్ క్లారిటీ!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!