బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్యవంశీ’.. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అజయ్ దేవగన్ అతిథి పాత్రలు పోషించారు. ఇప్పటికే కరోనా లాక్డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. తాజాగా దీపావళీ పండక్కి థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే థియేటర్లను తిరిగి తెరుస్తామని ప్రకటించడంతో దర్శకుడు రోహిత్ శెట్టి సూర్యవంశీ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇప్పటికే ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్న దర్శకుడు థియేటర్లోనే విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు. అక్షయ్ పోలీస్ పాత్రలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.