బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బెల్‌బాటమ్’.. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకొంది.. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 16న స్ట్రీమింగ్‌కు ఉంచుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. రంజిత్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణీ కపూర్ కథానాయికగా నటించింది.. ఇందులో అక్షయ్‌కుమార్ అండర్ కవర్ రా ఏజెంట్ ‘బెల్‌బాటమ్’గా కనిపించారు. ఇక బెల్‌బాటమ్ అనేది అక్షయ్‌కుమార్ కోడ్ నేమ్.. లారా దత్తా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుండగా.. అక్షయ్‌కుమార్ భార్యగా వాణీకపూర్ నటించింది. యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.