అక్షయ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ అంతా కపిల్ శర్మ షో లో పాల్గొని సందడి చేశారు. ఇక ఇందులో కత్రినా, అక్షయ కుమార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. రెదను సార్లు అక్షయ్ చెంప పగలకొట్టినట్లు చెప్పింది. సూర్యవంశీ చిత్రంలో అక్షయ్ భార్యగా కత్రినా నటిస్తోంది. ఇందులో అక్షయ్ ని కొట్టే సీన్ ఒకటి ఉండగా.. కత్రినా ఒక్క టేక్ లో పూర్తి చేసినట్లు తెలిపింది. రీటేక్ లు తీసుకోకుండా ఎలాగా అని అడుగగా అక్షయ్ ని నిజంగానే చెంప మీద కొట్టినట్లు తెలిపింది. ఇది మొదటిసారి కాదని ‘వెల్ కమ్’ చిత్రం చేసేటప్పుడు కూడా ఇలాగె చెంప మీద పెళ్లున కొట్టినట్లు తెలిపింది. ఆ చిత్ర సమయంలో దర్శకుడు చెంప దెబ్బ రియల్ గా ఉండాలని చెప్పారని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. అందుకు అక్షయ్ కూడా ఒప్పుకున్నాడని తెలిపింది.