కరోనా మహమ్మరి సినీ నిర్మాతలు, దర్శకులు, అగ్ర హీరోలకి సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తోంది! రెండేళ్లుగా అమాంతం విజృంభించి లాక్ డౌన్ లు నెత్తిన పడేస్తోంది. థియేటర్స్ లేక దేశంలోని అన్ని సినిమా రంగాలు అల్లాడిపోతున్నాయి. ఇక బాలీవుడ్ సంగతి సరే సరి. హిందీ సినిమాకు గుండెకాయ లాంటి ముంబై అత్యధిక కరోనా కేసులతో వణికిపోయింది. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా సద్దుమణిగింది. కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అయినా బీ-టౌన్ బిగ్ మూవీస్ రిలీజ్ కు…
క్షణం ఖాళీగా కూర్చోకుండా యమ బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. సినిమాలు, యాడ్స్, ప్రమోషన్స్, సోషల్ సర్వీస్ క్యాంపైన్స్… ఇలా చాలా చేస్తుంటాడు. మరో వైపు, వెబ్ సిరీస్ కూడా చేస్తానని ఆ మధ్య ప్రకటించాడు. అయితే, అది ఇంత వరకూ సెట్స్ మీదకైతే వెళ్లలేదు. కానీ, కృతీ సనన్ చెల్లెలు నూపుర్ సనన్ తో గతంలో ఓ వీడియో సాంగ్ చేశాడు అక్కీ! ఇప్పుడు రెండో పాట విడుదలైంది… అక్షయ్, నూపుర్ సనన్…
సౌత్ సినిమాలపై బాలీవుడ్ బడా స్టార్స్ మోజు రోజురోజుకు పెరుగుతోందేగానీ… తగ్గటం లేదు! అక్షయ్ కుమార్ అయితే మరింత జోరు మీదున్నాడు. ఆయన గత చిత్రం ‘లక్ష్మీ’. ఆ సినిమా లారెన్స్ తీసిన దక్షిణాది బ్లాక్ బస్టర్ ‘కాంచన’ మూవీయే! అయితే, ఇప్పుడు మరో రెండు కోలీవుడ్ సూపర్ హిట్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు మన రీమేక్స్ ‘ఖిలాడీ’!అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న పలు చిత్రాల్లో ‘బచ్చన్ పాండే’ కూడా ఒకటి. కృతీ సనోన్,…
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ తమిళ తంబీలను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా థ్రిల్ చేసింది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో “రాక్షసుడు” అనే టైటిల్ తో విడుదలై భారీ రెస్పాన్స్ తో పాటు నిర్మాతలకు లాభాలనూ తెచ్చిపెట్టింది. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాని ముగించుకొని వుంది. కాగా బాలీవుడ్ లో మాత్రం వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. అయితే తాజాగా రకుల్ మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన…
తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ ఘన విజయం సాధించింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా తమిళ భాషలో 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇదే సినిమాను తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా రీమేక్ చేశారు. ఇక్కడా ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో మంచి…
బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ముగ్గురు బాలీవుడ్ భామలతో కలిసి సినిమాను వీక్షించారు. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. “బెల్ బాటమ్” థియేట్రికల్ విడుదలకు ముందు సినిమా నిర్మాతలు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను హీరోయిన్లు వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తాతో పాటు వీక్షించారు. ఈ చిత్రం జూలై 27 న థియేటర్లలో విడుదలవుతోంది. ప్రత్యేక స్క్రీనింగ్ పిక్స్ ను హుమా ఖురేషి, వాణీ కపూర్ తమ ఇన్స్టాగ్రామ్…
”నాతో కుస్తీకి రెడీనా” అన్నాడు అతడు. ”నా ఇన్సురెన్స్ చెక్ చేసుకుని చెబుతా” అన్నాడు అక్షయ్ కుమార్! ఇంతకీ, ఖిలాడీ కుమార్ ని ‘కుస్తీకి రమ్మంటూ’ ఛాలెంజ్ విసిరిన ఆ ధీరుడు ఎవరంటారా? మరెవరో అయితే అక్షయ్ యుద్ధానికి సిద్ధం అనేవాడే! కానీ, అవతల ‘కొట్టేసుకుందాం రా’ అంటోంది ‘ద అండర్ టేకర్’! అండర్ టేకర్ అంటే రెస్లింగ్ ప్రియులకి బాగా తెలిసిన పేరు. అతను రింగ్ లోకి దిగి పిడి గుద్దులు కురిపిస్తే విధ్వంసమే.అటువంటి భారీ…
అక్షయ్ కుమార్ తన దాతృత్వం మరోసారి చాటుకున్నాడు. అలాగే, దేశ భద్రతా దళాలపై తనకున్న గౌరవాన్ని కూడా మళ్లీ ఆయన ఋజువు చేసుకున్నాడు. జూన్ 16న జమ్మూలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడి బీఎస్ఎఫ్ జవాన్లతో మాటామంతీ సాగించిన ఆయన స్కూల్ భవనం కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు!మారుమూల పల్లెలో అక్షయ్ విరాళంతో నిర్మించబోయే పాఠశాలకి ఆయన తండ్రి హరీ ఓం పేరును పెట్టనున్నారు. అయితే, జమ్మూలోని బందిపోరా…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జమ్మూ కశ్మీర్ లోని తులైల్ క్యాంపును సందర్శించారు. ఈమేరకు తన హృదయం పూర్తిగా జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయిందని అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అక్కడ సరిహద్దు భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లతో ఉల్లాసంగా గడిపారు. వారితో కలిసి డ్యాన్సులు చేసిన అక్షయ్ కుమార్, సరదాగా వాలీబాల్ కూడా ఆడారు. కాగా ఉత్తర కశ్మీర్లోని బంధీపురా జిల్లాలో నీరు గ్రామ పాఠశాల భవన నిర్మాణానికి…