Internal Conflict In Team India: భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియాలో ఉత్సాహం పెరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రెస్సింగ్ రూంలో మాత్రం పరిస్థితి మరో విధంగా ఉందని సమాచారం.
ఏడాది కాలంలో స్వదేశంలో టెస్టుల్లో భారత్ రెండు వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. భారత గడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశాయి. 2024 నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా నిలిచింది. 2025 ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో వైట్ వాష్‌కు గురవడం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఈ రెండు వైట్‌వాష్‌లు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేప్పట్టాకే జరిగాయి.…
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గత కొంతకాలంగా భారత జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో టెస్ట్, వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో కూడా షమీకి చోటు దక్కలేదు. షమీ చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. గాయం కారణంగా షమీ ఆడట్లేదని, అతడి ఫిట్‌నెస్‌పై తమకు ఎలాంటి సమాచారం లేదని అప్పట్లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు కూడా షమీ ఎంపిక కాలేదు. తనను ఆస్ట్రేలియా పర్యటనకు…
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రత్యర్థి జట్లకు తన మెరుపు బౌలింగ్ తో చెమటలు పట్టిస్తుంటాడు. కీలక మ్యాచుల్లో అద్భుతమైన బౌలింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీ రోల్ ప్లే చేస్తాడు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు షమీ ఎంపిక కాలేదు. కానీ, అక్టోబర్ 15న ప్రారంభమయ్యే 2025-26 రంజీ ట్రోఫీ సీజన్ కోసం బెంగాల్ జట్టులో షమీని తీసుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని బెంగాల్ క్రికెట్…
Ajit Agarkar: భారత క్రికెట్లో ఒక శకం ముగిసి.. మరో కొత్త శకానికి తెర లేపినట్లుగా బీసీసీఐ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అది ఏదో కాదు.. శుభ్‌మన్ గిల్ ఇకపై భారత వన్డే జట్టుకు నూతన కెప్టెన్ గా చేయడమే. దేశానికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ఉన్నప్పటికీ.. 38 ఏళ్ల రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంతో 26 ఏళ్ల గిల్ ఇప్పుడు…
Asia Cup 2025 Live Streaming on Star Sports and JioCinema: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనుంది. భారత క్రికెట్ జట్టులో ఎవరుంటారో అనే నిరీక్షణకు నేడు తెరపడనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు మధ్యాహ్నం 1.30కు జట్టును ప్రకటించనున్నారు. జట్టు ఎంపిక కోసం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలెక్టర్ల సమావేశం జరుగుతుంది. బీసీసీఐ సమావేశం తర్వాత చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్…
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) రాబోయే సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ఖరారు చేయడానికి.. భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు కీలకమైన సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాల్గొననున్నారు.