Ajit Agarkar: భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసి.. మరో కొత్త శకానికి తెర లేపినట్లుగా బీసీసీఐ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అది ఏదో కాదు.. శుభ్‌మన్ గిల్ ఇకపై భారత వన్డే జట్టుకు నూతన కెప్టెన్ గా చేయడమే. దేశానికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ఉన్నప్పటికీ.. 38 ఏళ్ల రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంతో 26 ఏళ్ల గిల్ ఇప్పుడు టెస్టులు, వన్డేలు అనే కీలకమైన రెండు ఫార్మాట్లలో సారథ్యం వహించనున్నాడు.దీనితో తద్వారా మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్‌లు అనే పాత విధానానికి బీసీసీఐ ముగింపు పలికింది.
Cough Sirup: కాఫ్ సిరప్ పై కీలక సమాచారం అందించిన నాగ్ పూర్ డాక్టర్
మరోవైపు, ప్రణాళికాబద్ధంగా చూస్తే మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్‌లు ఉండటం ఆచరణలో అసాధ్యం. అంతేకాక, రాబోయే ప్రపంచకప్ (2027) కోసం ఇప్పుడే దృష్టి పెట్టాలని ఛైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయం వెనుక గల దీర్ఘకాలిక ఆలోచనను స్పష్టం చేశారు. వన్డే ఫార్మాట్‌కు మ్యాచ్‌లు తక్కువగా ఉన్నందున, కొత్త కెప్టెన్‌కు తన వ్యూహాలను రూపొందించుకోవడానికి ఎక్కువ సమయం దొరకదని.. అందుకే ఈ మార్పు చేశామని అగార్కర్ వివరించారు.
India vs Pakistan: నేడు మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. అదే సీన్ రిపీట్ అవుతుందా?
ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసిన గిల్ నాయకత్వ పటిమపై బీసీసీఐ నమ్మకంతో ఉంది. సుదీర్ఘ విరామం (మార్చి 9 నుండి అక్టోబర్ 19 వరకు) తరువాత తిరిగి వన్డేలు ఆడనున్న నేపథ్యంలో.. కోచ్, జట్టుకు సులువైన ప్రణాళికను అందించాలనే ఉద్దేశంతోనే ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు అగార్కర్ తెలిపారు.