భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన షమీ.. ఈ సందర్భంగానే 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ని అందుకున్న మూడో బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. మొత్తం 80 మ్యాచ్‌ల్లో షమీ ఆ ఫీట్‌ని అందుకున్నాడు. అటు ఆఫ్గన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా అవే గణాంకాల్ని నమోదు చేయడంతో.. ఇద్దరూ సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.…
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అర్ష్‌దీప్ సింగ్.. అరంగేట్రంలోనే అదరహో అనిపించాడు. ఒక మెయిడెన్ ఓవర్ వేసి.. 16 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు బౌలర్ ఝులన్ గోస్వామి .. అదే ఏడాదిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అజిత్ అగార్కర్.. తమ ఎంట్రీ మ్యాచ్‌లోనే మెయిడెన్ ఓవర్ వేసి చరిత్రపుటలకెక్కారు. ఆ ఇద్దరి తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా…
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్తగా కనిపించనుంది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా.. అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్ వ్యవహరించనున్నట్లు సమాచారం. వీరిద్దరి పేర్లను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి రికీపాంటింగ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పాంటింగ్, వాట్సన్ ఇద్దరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లే కావడంతో వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో కోచ్, అసిస్టెంట్ కోచ్ పాత్రల్లో పాంటింగ్, వాట్సన్…
ఈరోజు భారత జట్టు న్యూజిలాండ్ తో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య ఆడితే మన జట్టుకు ప్రమాదం అని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే హార్దిక్ పాండ్య తన భారత కెరీర్‌ను కాపాడుకోవడానికి ఇప్పుడు ఆడుతున్నాడు. మేము హార్దిక్‌ను నెట్స్‌లో చూశాము. అయితే అతను దాదాపు రెండు నెలలుగా బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు. అలంటి…