ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్‌పై పాకిస్థాన్ ఇప్పుడు ఎదురుదాడికి తెరతీసింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు నవంబర్ 1లోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు దాటిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
గుజరాత్ డ్రగ్స్ కేసు ప్రకంపణలు సృష్టిస్తోంది. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయ్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయ్. గుజరాత్ డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకుంది DRI. కేసులో ఇప్పటి వరకు 8 మందిని కటకటాల్లోకి నెట్టింది. వీరిలో నలుగురు అఫ్ఘాన్ దేశస్తులు, ముగ్గురు భారతీయులు, ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నాడు. సుధాకర్ దంపతులతో పాటు మరో ఇద్దరిని చెన్నైలో పట్టుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. కాందహార్…
ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ చీమ చిటుక్కుమన్న అగ్రరాజ్యం అమెరికాకు తెలిసిపోతుందని పేరుంది. అయితే ఇదంతా అమెరికా గత వైభవంగా కన్పిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లే అమెరికా ఇటీవల కాలంలో చాలా వైఫల్యాలను చవిచూస్తోంది. రాజకీయ కారణాలో లేక పరిపాలన దౌర్భాగ్యమో తెలిదుగానీ ఆ దేశానికి చెందిన నిఘా సంస్థలు సైతం ఇటీవల కాలంలో మెరుగైన పనితీరును కనబర్చడం లేదు. తాజాగా అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల తప్పుడు నిర్ణయంతో 10మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి…
అమెరికా బలగాలు ఉపసంహరించుకున్నాయో లేదో.. ఆఫ్గనిస్తాన్‌లో అప్పుడే కల్లోలం. తాలిబన్ల చేతుల్లోకి దేశం ఇంకా పూర్తిగా వెళ్లనే లేదు… అప్పుడే అట్టుడుకుతోంది. బాంబు పేలుళ్తో దద్దరిళ్లుతోంది. ఇంకా ఏమేం చూడాలో తెలియక ఆఫ్గన్లు వణికిపోతున్నారు. తాజా పేలుళ్ల పాపం తాలిబన్లదు కాదు. కానీ దాని మీద కక్షతో ఇస్లామిక్ స్టేట్ చేసిన పని అది. ఐఎస్ ఆఫ్ఘన్ శాఖ ఇస్లామిక్ స్టేట్ -ఖోరాసన్ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. అయితే అది ఎవరిని టార్గెట్ చేసి దాడులకు దిగింది?…
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత.. అక్కడి భారత రాయభార కార్యాలయంలోని మొత్తం సిబ్బందిని భారత్‌కు తరలించారు అధికారులు.. అయితే, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది… సుమారు 1000 మంది భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.. వారిలో సుమారు 200 మంది సిక్కులు, హిందువులు స్థానిక గురుద్వారలో తలదాచుకున్నట్లు సమాచారం. ఆప్ఘన్ లో ఉన్న భారతీయులతో సహా, తాలిబాన్ల చేతిలో బందీలుగా ఉన్న సుమారు 150 మంది భారతీయులను భారత్ కు తరలించేందుకు,…
ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్ సహా.. అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.. అక్కడ పార్టీ కూడా చేసుకున్నారు.. అయితే, ప్రజలు మాత్రం భయంతో వణికిపోతున్నారు.. కాబూల్‌లో ప్రధాన రహదారులు.. వాహనాలతో భారీ ట్రాఫిక్‌తో దర్శనమిస్తుండగా.. ఇక, ఎయిర్‌పోర్ట్ లో ప్రజల రద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్రజలు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో కనిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని…