తాలిబన్ల ఎంట్రీ.. కాబూల్‌లో హృదయ విదాకర ఘటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్ సహా.. అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.. అక్కడ పార్టీ కూడా చేసుకున్నారు.. అయితే, ప్రజలు మాత్రం భయంతో వణికిపోతున్నారు.. కాబూల్‌లో ప్రధాన రహదారులు.. వాహనాలతో భారీ ట్రాఫిక్‌తో దర్శనమిస్తుండగా.. ఇక, ఎయిర్‌పోర్ట్ లో ప్రజల రద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్రజలు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో కనిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆప్ఘనిస్థాన్ నుంచి కాబూల్ విమానాశ్రయానికి పరుగులు తీస్తూ, చీమలదండుల్లా అందుబాటులో ఉన్న విమానాల్లోకి జనం చొచ్చుకుపోతున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి..
కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో తొక్కిసలాట తరహాలో గందరగోళ పరిస్థితులు నెలకొనడగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.. మిలటరీ విమానంలోకి చొచ్చుకుపోతున్న జనాన్ని నిలువరించేందుకు అమెరికా బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పలువురు మృత్యువాత పడగా, మరికొందరు గాయపడినట్టు చెబుతున్నారు. ఇక, విమానాలు రన్‌వేపై టే ఆన్‌కు వెళ్తున్న సమయంలోనూ.. దాని వెంట పరుగులు తీస్తున్నారు ప్రజలు.. చివరకు విమానం చక్రాల దగ్గర అయినా.. చోటు దొరికించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. అహిద్ కర్జియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అప్పుడే కదిలిన విమానం చక్రాలు పట్టుకుని ఎగిరిపోదామనుకున్న ముగ్గురు పౌరులు విమానం గాలిలోకి ఎగురగానే పట్టుజారి కిందకు పడ్డారు. ఆ ముగ్గురూ మృతిచెందినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇలా ఆఫ్ఘనిస్థాన్‌లో హృదయ విదారక ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!