ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ చీమ చిటుక్కుమన్న అగ్రరాజ్యం అమెరికాకు తెలిసిపోతుందని పేరుంది. అయితే ఇదంతా అమెరికా గత వైభవంగా కన్పిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లే అమెరికా ఇటీవల కాలంలో చాలా వైఫల్యాలను చవిచూస్తోంది. రాజకీయ కారణాలో లేక పరిపాలన దౌర్భాగ్యమో తెలిదుగానీ ఆ దేశానికి చెందిన నిఘా సంస్థలు సైతం ఇటీవల కాలంలో మెరుగైన పనితీరును కనబర్చడం లేదు. తాజాగా అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల తప్పుడు నిర్ణయంతో 10మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆ దేశానికే మాయని మచ్చగా మిగిలిపోయింది.
అఘనిస్తాన్లో తాలిబన్ల పాలనను అంతమొందించిన అమెరికా అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు సహకరించారు. ఆ దేశంలో అమెరికన్ మిలిటరీ బలగాలు దాదాపు 20ఏళ్లు తిష్టవేశాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న అమెరికా బలగాలను అమెరికా ఉపసంహరించుకునే కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా అప్ఘనిస్తాన్లోని అమెరికా బలగాలను గత నెలలో తరలించేందుకు అమెరికా యత్నించింది. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు తమ బలగాలను అమెరికా తరలించే ఏర్పాట్లు చేసింది.
ఈ సమయంలోనే కాబుల్ ఎయిర్ పోర్టుపై ఐసిస్-కే తీవ్రదాడులు దాడికి యత్నిస్తున్నట్లు అమెరికన్ నిఘా వర్గాలు యూఎస్ దళాలకు సమాచారం అందించారు. ఓ టయోటా వాహనంలో ఐసిస్ తీవ్రవాదులు కాబుల్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారని పేర్కొంది. తీవ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు యూఎస్ దళాలకు సమాచారం ఇచ్చారు. దీంతో యూఎస్ దళాలు టయోటా వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి చేశారు. ఈ దాడిని అమెరికా అప్పట్లో తీవ్రవాదులపై చేసిన దాడికి సమర్థించుకుంది.
తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో తాము డ్రోన్ దాడి చేపట్టామని వెల్లడించారు. అయితే నిఘా వర్గాలు తప్పుడు సమాచారం వల్ల దురదృష్టవశాత్తు డ్రోన్ దాడిలో 10మంది అప్ఘనిస్తాన్ పౌరులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ దాడికి క్షమాపణ కోరుతున్నట్లు అమెరికా సైన్యం ఒక ప్రకటన వెలువడించింది. ఈ తప్పిదం నుంచి ఖచ్చితంగా తాము గుణపాఠం నేర్చుకుంటామని పేర్కొంది. మరోసారి ఇలాంటివి జరుగకుండా చూసుకుంటామని వెల్లడించింది. మొత్తానికి అఫ్గన్లో అమెరికా నిఘా వైఫల్యంతోపాటు అన్నింటా ఫెల్యూర్స్ ను ముట్టగట్టుకుంది.