అమెరికా పారిపోయింది..! అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. ఈ సమయంలో తాలిబన్లతో ఇండియా చర్చలకు సిద్ధమైందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖతార్‌లోని దోహాలో తాలిబన్ పొలిటికల్ అఫైర్స్ చీఫ్ మహమ్మద్ అబ్బాస్‌తో భారత రాయబారి దీపక్ మిట్టల్ సమావేశమయ్యారు. అఫ్ఘానిస్తాన్‌లో ఉన్న భారతీయులను క్షేమంగా తిరిగి తీసుకొచ్చే అంశంపై చర్చించారు. దీంతో పాటు భారత్‌కి వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాదులకు, ఉగ్ర కార్యకలాపాలకు అఫ్ఘానిస్తాన్‌లో ఆశ్రయం కల్పించొద్దని దీపక్ మిట్టల్ స్పష్టం చేశారు. కాగా.. అఫ్ఘానిస్తాన్ దేశాన్ని గత 10 రోజుల క్రితం దౌర్జన్యంగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.