తాను దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, కిషోర్ ప్రినిపల్ సెకరెట్రి, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కుమురం భీమ్, బిర్శా ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం రూ. కోటి 50 లక్షల విలువైన పనులు ప్రారంభించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో కయ్యం ముదురుతోందట. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మీటింగ్ గరగరంగా సాగినట్టు తెలిసింది.నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదుల వెల్లువలా వచ్చినట్టు తెలిసింది.ఆమె ముందే పరస్పరం కౌంటర్స్ వేసుకున్నారట నాయకులు. పక్క జిల్లాకు చెందిన నేత ఒకరు పార్టీని కులాల వారిగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం ,గ్రూప్ లుగా మారడానికి సదరు నేతే కారణమని ముందు పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
KTR: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మెందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమే అని ఆయన విమర్శించారు. “బీజేపీ అంటే నమ్మకం కాదు… అమ్మకం” అంటూ పేర్కొన్నారు. Read Also: IND vs AUS:…
Minister Kishan Reddy: పట్టభద్రుల ఎన్నికలు దెగ్గరపడడంతో ఎన్నికలు జరిగే ఆయా జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చులు చేసి రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల బారిన పడేసిందని విమర్శించారు. రాష్ట్రం ఇప్పటికే 9…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కోనేరు కోనప్ప స్టైలే వేరు. పార్టీ ఏదైనా డోంట్ కేర్... జనంలో పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడమే మన స్టైల్ అన్నట్టుగా ఉంటారట ఆయన. 2004లో మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2014లో బీఎస్పీ తరపున గెలిచి ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పంచన చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు కోనప్ప.
Anji Reddy Chinnamile : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా వేములవాడ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశలంఓ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ.. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల 75 వేల పన్ను మినహాయింపు ఇచ్చింది..చాలా మందికి వేసులు బాటు లభించింది…60 ఏళ్ల నుండి కానిది మోడీ…
Uttam Kumar Reddy : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ నివాసంలో పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయని…
Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. ఇదివరకు బీఆర్ఎస్కు ఈ ప్రాంతం…
Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా గుడి వద్ద నేడు నాగోబా మహా పూజల జాతర ఘనంగా ప్రారంభం కానుంది. రాత్రి మహాపూజతో జాతర ఆరంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు సంప్రదాయరీతిలో ఈ జాతరలో పాల్గొననున్నారు. నాగోబా మహా పూజ ప్రత్యేకంగా నాగోబా దేవుడి పూజార్చనతో ప్రారంభమవుతుంది. మహాపూజ అనంతరం తెల్లవారుజామున కొట్టకోడళ్ళ బేటింగ్ (దేవుడికి పరిచయం చేసే సంప్రదాయం) నిర్వహించనున్నారు. ఇది వంశీయ సంప్రదాయానికి ఎంతో ప్రత్యేకమైన ఆచారం.…