KTR: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మెందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమే అని ఆయన విమర్శించారు. “బీజేపీ అంటే నమ్మకం కాదు… అమ్మకం” అంటూ పేర్కొన్నారు.
Read Also: IND vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్థనాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల టౌన్‌షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ నిల్వలతో సకల వనరులు కలిగిన ఈ సంస్థను అంగడి సరుకుగా మార్చిన పాపం మోడీ ప్రభుత్వానిదని ఆయన మండిపడ్డారు. సిసిఐ కి చెందిన ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్క కట్టి ఆన్‌లైన్‌లో అమ్మడానికి టెండర్లు పిలవడం బీజీపీ ప్రభుత్వ దగుల్భాజీ తనానికి నిదర్శనమని మంది పడ్డారు. నిర్మాణ రంగంలో సిమెంట్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సీసీఐని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని పదుల సార్లు కేంద్ర మంత్రులను తమ ప్రభుత్వం కోరినా, కనీసం వారు కనికరించకపోవడం ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అన్నారు.