Anji Reddy Chinnamile : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా వేములవాడ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశలంఓ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ.. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల 75 వేల పన్ను మినహాయింపు ఇచ్చింది..చాలా మందికి వేసులు బాటు లభించింది…60 ఏళ్ల నుండి కానిది మోడీ కి దక్కింది..ఒక్క ఉద్యోగికి లక్ష రూపాయలు లాభం ఉందన్నారు.
Talasani Srinivas Yadav : జీహెచ్ఎంసీ రాజకీయాల్లో ఉత్కంఠ.. మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం?
60 సంవత్సరాల కాలంలో యువకులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది…56 వేలు అకౌంట్ లో వేసిన తర్వాత ఓట్లు అడగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఓటు అడగాలని, 7500 కోట్లు ఫీజు రీయింబర్స్ ఇప్పించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లు అడగాలన్నారు అంజిరెడ్డి. ఫీజు రిమాంబర్స్ ఇప్పిస్తానే కాలేజి లు నడుస్తాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా ఉన్న విద్యా సంస్థలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు వారి కనీస వసతులు కూడా లేవన్నారు. ఆరు గ్యారంటీ లు నెరవేర్చిన తర్వాత ఓట్లు అడగాలని ఆయన వ్యాఖ్యానించారు. దేశమంతా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని అంజిరెడ్డి అన్నారు.
Stock Market: మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత.. నష్టాల్లో ముగిసిన సూచీలు