Crime News: ఉచిత సలహా ఇచ్చి.. బంగారు ఆభరణాలను అపహరించిన నకిలీ పోలీసులు!
- ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం
- ఉచిత సలహా ఇచ్చి బంగారు ఆభరణాలను అపహరించిన దుండగులు
- లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తిన బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం రేపింది. కొందరు దుండగులు పోలీసుల పేరుతో రోడ్డుపై ఇద్దరు దంపతుల బైక్ ఆపి.. ఉచిత సలహా ఇచ్చి బంగారు ఆభరణాలను అపహరించారు. మోసపోయామని తెలుసుకున్న ఆ దంపతులు బేల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
కౌట గ్రామానికి చెందిన సంతోష్, వందనలు తమ ద్విచక్ర వాహనంపై మాంగ్రూడ్ గ్రామం వెళ్లి తిరుగు పయనం అయ్యారు. పాఠన్ సమీపంలో రహదారిపై ఇద్దరు వ్యక్తులు వీరిని ఆపారు. తాము పోలీసులమని, ముందు ఓ హత్య జరిగిందని చెప్పారు. మెడలో బంగారాన్ని తీసి కవర్లో పెట్టుకొని వెళ్లమని సలహా ఇచ్చారు. దుండగులు చెప్పిన మాట విన్న వందన.. తన మెడలో బంగారాన్ని తీసింది. బంగారాన్ని తాము కవర్లో పెట్టి ఇస్తామని దుండగులు చెప్పగా.. వారి చేతికి ఇచ్చింది. గులక రాళ్ల కవర్ వందనకు ఇచ్చి.. బంగారు ఆభరణాలతో దొంగలు పరార్ అయ్యారు.
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ఇది గమనించిన సంతోష్, వందన దంపతులు తాము మోసపోయామని గ్రహించారు. లబోదిబో అంటూ బేల పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తారు. రెండు బైక్‌లపై నలుగురు మాటు వేసి.. పోలీసుల పేరుతో మోసం చేశారని బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంను పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..