ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలెపూర్ గ్రామం వద్ద ఐచర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో డీసీఎం వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
బెట్టింగ్‌కు యువకుడి బలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జైనాథ్ మండలం పిప్పర్‌వాడ గ్రామానికి చెందిన అలిశెట్టి సాయి (23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అభ్యుదయ హాస్టల్ కిచెన్ సహాయకుడిగా పని చేసేవాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పోవడం వల్ల మనస్థాపం చెందాడు. అభ్యుదయ పాఠశాల ఆఫీస్ వంతెనల వద్ద ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ పార్టీనే ఉండదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
నేడు ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి లో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నారు. తుడుం దెబ్బ రాయి సెంటర్ ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివాసి చట్టాల అమలు, హక్కులు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసి చట్టాలు హక్కులు జీవోలు అన్నీ కూడా కాలరాస్తున్నాయని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, వారిపై దాడులను తిప్పికొడుతూ తమ అస్తిత్వాన్ని కాపాడుకునే…
Tiger Search Operation: కొమురం భీం జిల్లాలోని ఇటిక్యాల పహాడ్ గ్రామం దగ్గర్లోని ప్లాంటేషన్ లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. తెలంగాణా సరిహద్దు గ్రామంతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో ఒక క్యాటిల్ కిల్ జరిగిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొనింది.
Tiger Search Operation: కొమురం భీం జిల్లా అడవుల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసిన పులి.. బెబ్బులి భయంతో పంట చెన్ల వైపుకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఇటిక్యాల పహాడ్, దుబ్బగూడ శివారు ప్రాంతాల వైపు వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు.
Winter Weather: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా రెండు పులుల హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మగపులి జానీ మహారాష్ట్ర కు వెళ్లిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.