స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతున్నారు రాజకీయ నేతలు.. తెలంగాణ కొన్ని స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడిపోగా.. మిగతా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడంతో.. పోటీ అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో తమ ప్రజాప్రతినిధులు చేజారకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు..
అందులో భాగంగా ఆదిలాబాద్‌లో అధికార పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంప్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యింది… ఇప్పటికే ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు నేతలు.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లే ఓటర్లను మూడు శిబిరాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.. కాగా, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు.. టీఆర్ఎస్ పార్టీ నుంచి దండే విఠల్ పోటీ చేస్తుండగా.. ఇండిపెండెంట్ గా పెందూర్ పుష్ప రాణి బరిలో ఉన్నారు. అయితే, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న పుష్పరాణికి మిగతా పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయనే టాక్ ఉంది.. దీంతో.. అధికారి పార్టీ అప్రమత్తం అయ్యింది.