తెలంగాణలో చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. దాంతో గజగజ వణికి పోతుంది ఏజెన్సీ. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూలో 10.4 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా… బేలాలో 10.9 గా కనిష్ట ఉష్ణోగ్రతలు… గిన్నేదరీ లో 10.9… చెప్రాల 11.3… సోనా ల 11.5… బోరాజ్ 11.5 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు అయ్యాయి. అయితే ఉదయం మంచు దుప్పటి కమ్ముకుంటోంది. ఆదిలాబాద్‌తోపాటు పలు ఇతర జిల్లాల్లో కూడా చలి వణికిస్తోంది.