ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తాను ముందే చెప్పానని లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. తాతా మధు గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. తాతా మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎ కేసీఆర్ పాలన, యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన ఘనత సీఎం కేసీఆదేనని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్, ఖమ్మం మేయర్, సత్తుపల్లి, కొత్తగూడెం, మధిర, వైరా, మున్సిపాలిటీలతో పాటు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ టి.ఆర్.ఎస్ గెలుచుకుందని నామా వెల్లడించారు.
సమైక్య రాష్ట్రంలో సాగు, తాగు నీటి సమస్యలతో పాటు విద్యుత్ సంక్షోభం ఉండేది… కానీ స్వరాష్ట్రం వచ్చిన తరువాత దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజారిటీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ వారే ఉండి వారి ప్రతినిధిని గెలిపించారన్నారు. గెలిచిన అభ్యర్థులకు నామ నాగేశ్వర్‌రావు అభినందనలు తెలిపారు.
ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్‌దే విజయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఆదరణ ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి స్పష్టమైందన్నారు. ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమిష్టి కృషితోనే ఎమ్మెల్సీగా దండే విఠల్ గెలుపొందారని మంత్రి అన్నారు.